ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.