వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలు 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నియమాలు ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు క్లీన్ ఎనర్జీ వాహనాలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకోగా, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది.