Homeహైదరాబాద్latest Newsఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

ఇదే నిజం దేవరకొండ : బుధవారం దేవరకొండ పట్టనంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎన్ ఎస్ యు ఐ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ ఆద్వర్యంలో ఎన్ ఎస్ యు ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 4వ తారీకున విద్యార్థి సంఘాల ఐక్య కమిటి పిలుపులో భాగంగా (ఎన్.యస్.యు.ఐ., యస్.ఎఫ్.ఐ., ఎ.ఐ.యస్.ఎఫ్, పి.డి.యస్.యు. వి.జె.యస్. ఎ.ఐ.పి.యస్.యు., పి.వై.సి., డి.వై.ఎఫ్.ఐ, ఎ.ఐ.వై.ఎఫ్., పి.వై.ఎల్. వై.జె.యస్.,) విద్యార్ధి సంఘాలు భారతదేశ వ్యాప్తంగా విద్యాసంఘాలు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. కావున మా ఉద్యమానికి మీ మద్దత్తు తెలుపుతూ విద్యాసంస్థలు అన్నీ ఎ.జి నుండి పి.జి వరకు బంద్ కు సహకరించవలసిందిగా కోరుచున్నాము.

డిమాండ్లు:

1). ఈనెల 6వ తేదీన నీట్ కౌన్సిలింగ్ జరిపే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

2). 24 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో కేంద్రప్రభుత్వం ఆదుకుంటుంది.

3) ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి.

4). అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్.టి.ఎ. సంఘమును వెంటనే రద్దు చేయాలి.

5) 24 లక్షల మంది నీట్ పరీక్ష వ్రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలి.

6). తెలంగాణ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిగార్లు దీనిపైన స్పందించాలి.

7). కేంద్ర విద్యాశాఖామంత్రి నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి.

8). నీట్ పరీక్ష నిర్వహించిన ఏజెన్సీ ఎన్.టి.ఎ.ను రద్దు చేయాలి. అలా చేసేంతవరకు అందరం కలిసి పోరాటం చేద్దాం.

9) ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద మహాదీక్ష చేస్తాము.

10) న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే వుంటుంది.

దయచేసి కే.జి. నుండి పి.జి. వరకు అన్ని విద్యాసంస్థలు బంద్లో పాల్గొనాలని, బాధిత విద్యార్థులకు అండగా ఉండాలని విద్యార్ధి సంఘాల నాయకులమందరము కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ పిఏ పల్లి మండల అధ్యక్షులు మునగల శివ, ఎనిమల్ల రమేష్, భాషా, రఘు, అజయ్ తదితరలు పాల్గోన్నారు.

Recent

- Advertisment -spot_img