బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి
- ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
- ఉత్తర్వులు జారీ చేసిన జేపీ నడ్డా
bandi sanjay: ఇదేనిజం, నేషనల్ బ్యూరో: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ని నియమించారు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కార్యదర్శిగా సత్యకుమార్ (ఏపీ)ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నారు. బండిని స్టేట్ చీఫ్ గా తొలగించిన అనంతరం ఆయన కొంత నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు డీకే అరుణ సైతం అధిష్ఠానం పట్ల కాస్త అసంత్రుప్తిగా ఉన్నారు. దీంతో బీజేపీ పెద్దలు తాజాగా వీరికి పదవులు కట్టబెట్టారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని విమర్శలు గుప్పిస్తున్న రఘునందన్ రావుకు మాత్రం ఏ పదవి దక్కకపోవడం గమనార్హం.