Homeఫ్లాష్ ఫ్లాష్Bandi sanjay:కేసీఆర్ ది అబ్ కీ బార్ ఆబ్కారీ సర్కార్-ఎంపీ బండి సంజయ్

Bandi sanjay:కేసీఆర్ ది అబ్ కీ బార్ ఆబ్కారీ సర్కార్-ఎంపీ బండి సంజయ్

Bandi sanjay:ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే మోసానికి ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రతిరోజు ఎవరిని మోసం చేద్దామా? ఏ కులం ఓట్లు కొల్లగొడదామా? అనే ఆలోచనే తప్ప ప్రజలకు మంచి చేయాలనే తపనే లేదన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓట్లను చీల్చేందుకు పీవీ జపం చేసిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లో గెలిచాక మళ్లీ పీవీ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరుకావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానిస్తే… కేసీఆర్ మాత్రం ఇంకా పీవీని అవమానిస్తూనే ఉన్నాడని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహరావు 102వ జయంతి సందర్భంగా ఈరోజు నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ కు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ఆయనకు ఘన నివాళి అర్పించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీనీ నేటికీ అవమానిస్తూనే ఉన్నడు. ఈరోజు పీవీ జయంతి అయినా కనీసం ఇక్కడికి వచ్చి నివాళి అర్పించలేదు. ఎన్నికలొస్తేనే పీవీ సహా ప్రముఖులు గుర్తుకొస్తారు.గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల సమయంలో బ్రాహ్మణుల ఓట్లను చీల్చడానికి పీవీ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరైండు. విదేశాల్లో జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తానని గొప్పలు చెప్పిండు. ఎన్నికల్లో ఓట్లు దండుకున్నాక మళ్లీ పీవీఊ సెత్తరన్నారు

బ్రాహ్మణ సమాజం కేసీఆర్ రాజకీయాలను గుర్తుంచుకోవాలి. ఎట్లా ఎవరిని నమ్మించాలి, ఏ మతాన్ని నమ్మించి ఓట్లు దండుకోవాలనే విషయంలో ఆరితేరిన వ్యక్తి. కేసీఆర్ అంటేనే ద్రోహం. ఆయన రాజకీయమంతా ద్రోహం, మోసమే అని బండి సంజయ్ అన్నారు.

Recent

- Advertisment -spot_img