HomeతెలంగాణBandi sanjay:వేల కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చాయ్ కేసీఆర్ ?-బండి సంజయ్

Bandi sanjay:వేల కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చాయ్ కేసీఆర్ ?-బండి సంజయ్

Bandi sanjay:తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బిచ్చమొత్తుకున్న కేసీఆర్ కుటుంబం నేడు వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎట్లా కూడగట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలది ఫినాయిల్ బంధమని, కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం వంటిదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా పోయేది బీఆర్ఎస్ లోకేనని అన్నారు. హైదరాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించిన బండి సంజయ్ కుమార్ హిందువులను కించపరిస్తే బట్టలూడదీసి ఉరికిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఆత్మకూర్ లో జరిగిన మక్తల్ నియోజకవర్గ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు….ఆత్మకూరులో సభ పెడుతున్నారంటేనే నాకు ఆత్మ విశ్వాసం వస్తోంది. కేసీఆర్ చేయించుకున్న ఏ సర్వేలోనైనా గెలిచేది బీజేపీయేననే నివేదికలొస్తున్నాయి. మరో 5 నెలలు సమయం నాకివ్వండి. కేసీఆర్ ను గద్దె దించే బాధ్యత నాది. కేసీఆర్ ప్రజలకోసం చేస్తుందేమీ లేదు. ఎంతసేపు ప్రజలను ఎట్లా మోసం చేయాలి? పక్క పార్టీలను ఎట్లా దెబ్బతీయాలనే ఆలోచన తప్ప మరోకొటి లేదు.
ముఖ్యమంత్రిగా ఉంటూ 9 ఏళ్లుగా ఏం సాధించినవ్? 5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినవని అడుగుతుంటే నోరుమెదపడం లేదు. పొరపాటున మళ్లీ కేసీఆర్ సీఎం అయితే మరో 5 లక్షల కోట్ల అప్పు చేస్తడు. ఒక్కో తలపై రెండున్నర లక్షల అప్పు చేస్తడు..ఒకనాడు తినడానికి తిండేలేని కేసీఆర్ కు వేల కోట్లు ఎలా వచ్చాయి? ఆత్మకూరుసహా తెలంగాణలోని పేదలంతా పేదలుగానే మారితే బిచ్చమెత్తకునే కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎట్లా సంపాదించింది? విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెట్టే స్థాయికి వచ్చారు? ఒకనాడు డబ్బులు కట్టలేదని ప్రచార రథాన్ని ఫైనాన్స్ వాళ్లు గుంజుకుపోతుంటూ చూస్తూ ఊరుకుండిపోయిన చరిత్ర కేసీఆర్ దే.
నిజాం రాజ్యంలో రజాకార్ల రూపంలో రాష్ట్రాన్ని దోచుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ దే. అందుకే అధికార మదమెక్కి 600 కార్లతో మహారాష్ట్ర కు పోయి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నరు. ‌కేసీఆర్ ది డ్రంక్ అండ్ డ్రైవ్ సర్కార్. మందు తాగి బండి నడిపితే కేసు పెడుతున్న పోలీసులు… మందు తాగి రాష్ట్రాన్ని పాలిస్తే ఎందుకు కేసు పెట్టడం లేదు? అని బండి సంజయ్ అన్నారు

Recent

- Advertisment -spot_img