- వరంగల్ సభలో స్పెషల్ అట్రాక్షన్ గా సంజయ్
- ఆకట్టుకున్న స్పీచ్
- పదవి పోయినా తగ్గని జోరు
- కేటీఆర్ పై ఘాటు విమర్శలు
BANDI SANJAY:కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవలే బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డిని బీజేపీ స్టేట్ చీఫ్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తీవ్ర అసహనంతో ఉన్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇవాళ వరంగల్ లో నిర్వహించిన మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. అదే వేదిక మీద ప్రధాని మోడీ, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ తదితరులు ఇవాళ ప్రసంగించారు. అయినప్పటికీ బండి సంజయ్ స్పీచ్ కే జనాల నుంచి రియాక్షన్ కనిపించింది.
కేంద్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రాజీ కుదర్చుకున్నాయని.. అందులో భాగంగానే బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి అవకాశం కల్పించారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ వరంగల్ సభలో పాల్గొన్నారు. కాగా బండి సంజయ్ స్పీచ్ ప్రారంభించగానే సభ మొత్తం ఉర్రూతలూగింది.
మొత్తంగా ఇవాళ నిర్వహించిన బీజేపీ సభలో బండి సంజయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటీవలే పదవి కోల్పోవడంతో అక్కడికి వచ్చిన కార్యకర్తల్లో బండి పట్ల కాస్త సానుభూతి వ్యక్తమయ్యింది. కొందరు నేతలు, కార్యకర్తలు బండిని ఆలింగనం చేసుకున్నారు. మరోవైపు బండి సంజయ్ ఐటీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ప్రధాని రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని చెప్పుకొచ్చారు. ఏ మొఖం పెట్టుకొని రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ప్రశ్నించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.