Homeక్రైంBandi sanjay arrest:పేపర్ లీక్ కేసులో A 1గా బండి సంజయ్- సీపీ రంగనాథ్‌

Bandi sanjay arrest:పేపర్ లీక్ కేసులో A 1గా బండి సంజయ్- సీపీ రంగనాథ్‌

Bandi sanjay arrest: కమలాపూర్ లో పదో తరగతి హింది ప్రశ్నపత్రం లీక్ రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్టును అరెస్ట్ చేసిన పోలీసులు.. శివ, శివ గణేష్ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ప్రశాంత్ అనే వ్యక్తి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా పంపించాడని, దానికంటే ముందు ఫోన్లో మాట్లాడాడని గుర్తించిన పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత అంటే బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు కరీంనగర్లోని జ్యోతి నగర్ లో బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సీపీ రంగనాథ్ వెల్లడించారు. కమలపూర్ పోలీస్ స్టేషన్‌లో ముద్దాయిలను కోర్టులో హాజరు పర్చామన్నారు. ఇందులో A-1గా బండి సంజయ్, A-2గా బూరం ప్రశాంత్ ప్రీ లాన్సర్ జర్నలిస్టు, A-3గా మహేష్, బూరం ప్రశాంత్ చైన్ లింక్ ద్వారా వైరల్ చేసినట్లుగా పేర్కొన్నారు. 120b, 420,447,505(1)(b) IPC sec (4) సెక్షన్లలో కేసులు నమోదు చేశామన్నారు. 11.18 నిమిషాలక్7 హైదరాబాద్ లో మీడియా హెడ్స్ కు ఫార్వార్డ్ చేశాడని తెలిపారు. 11.24 నిమిషాలకు బండి సంజయ్ కి ఫార్వార్డ్ చేశాడన్నారు. చాలామందికి మెసేజ్ చేశాన్నారు. ఈటెల రాజేందర్, అతని PA, పలువురు బీజేపీ నేతలకు పేపర్ పంపారని తెలిపారు. ప్రశాంత్ తో పాటు మహేష్ కూడా చాలామందికి పంపించినట్లుగా సీపీ రంగనాథ్ తెలిపారు

రిమాండ్ రిపోర్టు ఇదే

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసులో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో బండి సంజయ్‌ను ఏ1గా నమోదు చేశారు పోలీసులు. హిందీ ప్రశ్నపత్రంను వాట్సాప్ గ్రూప్ లలో వైరల్  చేయడంతోపాటు నిందితులు, బండి సంజయ్ అరెస్టు టైం లైన్ పేర్కొన్నారు. కమలపూర్‌లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 9.30 నిమిషాలకు పరీక్ష మొదలైనంది. శివ అనే బాలుడు ఫస్ట్ ఫ్లోర్ కు చెట్టుఎక్కి రూమ్ నెంబర్ 3 వద్దకు వెళ్ళాడు. హరీష్ అనే విద్యార్థి నుంచి హిందీ పేపర్ తీసుకున్నాడు. 9.42 నిమిషాలకు తన సెల్ ఫోన్లో ఫోటో తీసుకొని 9.45 నిమిషాలకు బయటకు వచ్చాడు. ఆ ఫోటో శివగణేష్ అనే యువకుడికి పంపిస్తాడు. శివగణేష్ 9.59 నిమిషాలుకు SSC-2019- 20 వాట్సాప్ గ్రూప్ లలో పోస్ట్ చేశాడు.. ఈ గ్రూప్ నుంచి మహేష్ అనేవ్యక్తి KMCలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు.. ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్టుకు 10.04 నిమిషాలకు పంపించాడు. ప్రశాంత్ 10.47 నిమిషాలకు సీను ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. అనంతరం 11.11 నిమిషాలకు బ్రేకింగ్ తయారుచేసి అదే గ్రూప్ లో పోస్ట్ చేశాడు.. ఆ తర్వాత 11.30నిమిషాలకు బండి సంజయ్ కి పోస్టు చేశాడు. గ్రూప్ లలో పోస్ట్ చేయడంతో పాటు, కొంతమంది జర్నలిస్టులకు, బీజేపీ నాయకులకు పోస్టు చేశాడు. రెండు గంటల వ్యవధిలో 142 కాల్స్ మాట్లాడాడు..పేపర్ బయటకు పోస్ట్ చేసిన నిందితులతో పాటు ప్రశాంత్ ను కస్టడీలోకి తీసుకున్నారు.. మంగళవారం రాత్రి 8.33 నిమిషాలకు సీపీ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలోనే ప్రశాంత్ బండి సంజయ్ కి ప్రశ్నపత్రాలు పోస్టు చేసిన విషయం మీడియా ముందు ప్రకటించారు.. అనంతరం శివగణేష్, ప్రశాంత్ తో పాటు మైనర్ బాలుడు శివను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 10.30 నిమిషాలకు బీజేపీ కార్యకర్తలు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంను ముట్టడించారు.. అనంతరం 11 గంటలకు కరీంనగర్ నగర్ లోని బండి సంజయ్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. 11.30 నిమిషాలకు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు..కరీంనగర్ నుండి బొమ్మల రమారం PSకు తెల్లవారుజామున 3.33 నిమిషాలకు తరలించారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తల ఆందోళన, అరెస్టులు జరిగాయి. ఈరోజు ఉదయం 10.గంటలకు బండి సంజయ్ ని పోలీస్ వాహనంలో వరంగల్ వైపు తీసుకువచ్చారు.. భువనగిరి, ఆలేరు, జనగామ, పాలకుర్తి, తొర్రూరు, జఫర్ గఢ్ మీదుగా మడికొండ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకొచ్చారు..సాయంత్రం 4.12 నిమిషాలకు మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు.

bandi sanjay arrest 3 ఇదేనిజం Bandi sanjay arrest:పేపర్ లీక్ కేసులో A 1గా బండి సంజయ్- సీపీ రంగనాథ్‌

ఫోన్‌ దాయాల్సిన అవసరం ఏంటి..- సీపీ రంగనాథ్‌

బండి సంజయ్‌ ఫోన్‌ ఎందుకు దాస్తున్నారని.. నిర్దోషి అయితే ఫోన్‌ దాయాల్సిన అవసరం ఏంటని సీపీ రంగనాథ్‌ ప్రశ్నించారు. ఫోన్‌ తెస్తే సగం ప్రశ్నలకు సమాధానాలు దొరికేవన్నారు. ఖచ్చితంగా వాట్సప్‌ చాట్‌, కాల్స్‌ను రికవరీ చేస్తామన్నారు.  ప్రశాంత్‌ పేపర్‌ పంపాడనే బండి సంజయ్ ని అరెస్ట్ చేయలేదని వివరణ ఇచ్చారు. పేపర్‌ లీకేజీ అంతా ఓ గేమ్‌ప్లాన్‌లా చేస్తున్నారని తెలిపారు. పేపర్‌ను ప్లాన్ ప్రకారం షేర్ చేస్తున్నారని అన్నారు. సోమవారం సాయంత్రం ప్రశాంత్, బండి మధ్య వాట్సప్‌ చాట్ జరిగిందన్నారు. ఈ చాట్‌ మరుసటి రోజు పేపర్లో వచ్చిందన్నారు. ప్రశాంత్‌తో బండి వాట్సప్‌కాల్‌ కూడా మాట్లాడారు. బండి సంజయ్‌ డైరెక్షన్‌లోనే లీకేజీ అంతా జరిగింది, ఎగ్జామ్స్‌ను రద్దు చేయించాలనే దురుద్దేశం కనిపిస్తోందన్నారు.

Recent

- Advertisment -spot_img