Homeహైదరాబాద్latest NewsBandi Sanjay : ముస్లింలపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Bandi Sanjay : ముస్లింలపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Bandi Sanjay : ముస్లింలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేసారు. బీసీల్లో ముస్లింలను ఎలా చేరుస్తారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజశేఖర్ ప్రభుత్వంలో 4 శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలుగా గుర్తిస్తే..హైదరాబాద్ లో హిందువులకు ఘోరమైన అన్యాయం జరిగింది. 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇవాళ ముస్లింలు గెలిచారు. మీరు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చి..10 శాతం ముస్లింలను బీసీల్లో కలిపితే ఏ గ్రామంలో కూడా హిందువులైన బీసీలు గెలవారు. పైగా ముస్లింలు ఓట్లు వారికీ మాత్రమే వేసుకుంటురు. మరి బీసీలు బ్రతుకు ఏంటి ఇవాళ .. హిందువులు బ్రతుకు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో.. బిచ్చా బ్రతుకా ఏమైనా హిందువలది.. హిందువులు అడుక్కోవాలా..? బిత్త మెత్తుకోవాలా అని అన్నారు. ఎంఐఎం పార్టీ ఒత్తిడి తాలూకు వల్ల ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. మేం బొట్టు పెట్టుకుంటాం.. మాకు గోత్రం ఉంటుంది.. మాకు జన్మ నక్షత్రముంటుంది.. మొలదారం కట్టుకుంటామంటూ మా జాతి ఇది అంటూ బండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

Recent

- Advertisment -spot_img