HomeతెలంగాణBandi Sanjay : కేసీఆర్​ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు..

Bandi Sanjay : కేసీఆర్​ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు..

Bandi Sanjay : కేసీఆర్​ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు..

Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని వెల్లడించారు.

సీఎం ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చన్నారు.

సానుభూతి కోసమే కమ్యూనిస్టులు, విపక్ష నేతలతో సీఎం భేటీ అవుతున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

సీఎం అవినీతిపై కేంద్రం ఆగ్రహంగా ఉందని.. అందుకే చర్యలకు సిద్ధమైందన్నారు.

ఈ విషయం తెలిసే కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారని ఆరోపించారు.

ఆగిపోతుదంటూ..రూ. 2.4 కోట్ల మెర్సిడెస్ కారును కాల్చేశాడు

ఆడ బిడ్డ కోసం 14 మంది మ‌గ‌పిల్ల‌ల‌ను క‌న్నార‌ట‌

జైలుకు వెళ్లొచ్చనే విషయం కేసీఆర్‌కు తెలిసిపోయిందని పేర్కొన్నారు.

సానుభూతి కోసమే ప్రయత్నాలు

కేంద్ర ప్రభుత్వం… జైలుకు పంపితే సానుభూతి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బండి సంజయ్ ప్రారంభించారు.

“అవినీతిపరులందరూ కూడా ఒక గొడుకు కిందకు వస్తున్నారు. వాళ్లంతా వేలకోట్లు సంపాదించుకున్నారు.

ఈయనేమో లక్షల కోట్లు కాజేశారు. అందుకే దీనికోసం శిక్షణ ఏర్పాటు చేసినారు.

వాళ్లంతా ఇప్పుడొక పార్టీ పెట్టుకుంటారు. అదేంటంటే ‘దోచుకోండి.. దాచుకోండి’ అనే పార్టీ.

సీఎం ఎక్కడున్నా కూడా చర్యలు తప్పవు. ఈయనో పెద్ద అవినీతి తిమింగలం.

సీపీఎం వాళ్లతో మీటింగ్​లు అంతా డ్రామా. అంతా తెలిసే​ సానుభూతి కోసం ప్రయత్నాలు.

తెలంగాణ ప్రజలు మీ డ్రామాను గమనిస్తున్నరు. నువ్వు ఫామ్​హౌస్​లో ఉన్నా.. ఎక్కడ ఉన్నా కూడా నిన్ను జైలుకు పంపుడే.” –బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Rolls royce : రోల్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించిన భారతీయ రాజు

అన్నమోదిక్కు… ఆకలోదిక్కు…!!

దేశం అంతా డాక్టర్లే

Recent

- Advertisment -spot_img