– బీజేపీ ఎంపీ బండి సంజయ్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: హామీల అమల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎన్నడూ విఫలం కాలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంపీ కాక ముందే తాను పోరాటాలు చేస్తూ ఐదుసార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. బీజేపీ కార్యకర్తపై దాడి జరిగితే అనేక సార్లు పోరాటం చేశానన్నారు. బీఆర్ఎస్ పాలనలో జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రజా పాలన రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు