సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని దుయ్యబట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని మరీ.. సినిమా లెవల్‌లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటు’ అని విమర్శించారు.