కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కలిశారు. అమిత్ షా జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి సత్కరించారు. అనంతరం అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శాఖాపరమైన చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.కాగా, అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ జాతీయ పోలీసు స్మారకం వద్ద నివాళులర్పించిన సంగతి తెలిసిందే.