Homeతెలంగాణ#BandiSanjai : హిందువుల ఇళ్లనే కూల్చుతున్నారు..

#BandiSanjai : హిందువుల ఇళ్లనే కూల్చుతున్నారు..

జీహెచ్ఎంసీ అధికారులు మేయర్ కలిసి కేవలం హిందువుల ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ముస్లీం ప్రభావిత ప్రాంతాలకు మినహాయింపు ఇస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్‌ల పలు ప్రాంతాల్లో కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.

జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

కేవలం హిందువుల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమన్నారు.

ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు.

ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలు అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలన్నారు.

వీటిని మినహాయింపు ఇచ్చి అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు కొనసాగిస్తు న్నారన్నారు.

ఇది ఒక రకంగా మెజారిటీ లపై ప్రభుత్వం చేస్తున్న దాడి అన్నారు బండి సంజయ్.

ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్చివేతలు నిలిపివేయాలన్నారు.

ఖైరతాబాద్ జోన్, చార్మినార్ జోన్ లో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన తర్వాత నే మిగతా జోన్ లలో చేపట్టాలని డిమాండ్ చేశారు బండి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img