Homeహైదరాబాద్latest Newsపాక్ పై బంగ్లా చరిత్రాత్మక విజయం.. పాక్ చెత్త రికార్డు!

పాక్ పై బంగ్లా చరిత్రాత్మక విజయం.. పాక్ చెత్త రికార్డు!

పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం. దేశంలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్.. అవాంఛనీయ రికార్డులను తమ పేరిట నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో, వారి సొంత గడ్డపై ఐసిసిలోని పాత పది మంది సభ్యులతో ఓడిన రెండో జట్టుగా అవతరించింది. అదేమిటంటే.. స్వదేశంలో పాకిస్థాన్‌ను అన్ని ప్రధాన దేశాల చేతిలో ఓడిపోయింది.

Recent

- Advertisment -spot_img