Homeహైదరాబాద్latest NewsBank: బ్యాంకుల కస్టమర్లకు శుభవార్త.. భారీగా లోన్ రేట్లు తగ్గింపు..!

Bank: బ్యాంకుల కస్టమర్లకు శుభవార్త.. భారీగా లోన్ రేట్లు తగ్గింపు..!

Bank: హోమ్ లోన్ కలలు కనేవారికీ, కొత్త కారు కొనాలని ఆలోచించేవారికీ శుభవార్త! ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో, కెనరా బ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంక్ తమ రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ను 25 బేసిస్ పాయింట్లు కుదించాయి. ఈ రేటు తగ్గింపు మీ జేబుకు కాస్త ఊరట కలిగిస్తూ, ఇళ్లు, వాహన రుణాలను మరింత చవకగా మార్చనుంది!

ఇండియన్ బ్యాంక్ ఆఫర్:

  • ఇళ్ల రుణాల వడ్డీ రేటు 8.15% నుంచి 7.90%కి డౌన్!
  • వాహన రుణాలు 8.50% నుంచి 8.25%కి తగ్గాయి.
  • అదనంగా, ప్రాసెసింగ్ ఫీజులపై డిస్కౌంట్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు జీరో!

కెనరా బ్యాంక్ స్పెషల్:

  • ఇళ్ల రుణాలు ఇప్పుడు కేవలం 7.90% నుంచి స్టార్ట్.
  • వాహన రుణాలు 8.20% నుంచి ప్రారంభం.
  • మీ EMIలు లైట్ అవుతాయి, కలల ఇల్లు, కారు మీ సొంతం అవ్వడం ఈజీ!

Recent

- Advertisment -spot_img