Bank jobs in andhra pradesh : ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏం చదవాలి?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పలు జిల్లాల్లో డీసీసీబీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ , అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ (Online)లోనే ఉంటుంది. రెగ్యులర్‌గా బ్యాంక్ జాబ్స్ (Bank Jobs) చదివేవారికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది.
బ్యాంక్ ప్రిపరేషన్ చేసే వారికి సేమ్ సెలబస్‌తో పరీక్ష ఉండనుంది.
ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష విధానంతోపాటు ప్రిపేరేషన్ ప్లాన్ ఎంటీ? ఎలా చదవాలో తెలుసుకోండి. పోస్టుల దరఖాస్తు కోసం ఆయా జిల్లాలో అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలి.
అభ్యర్థులకు ముందుగా ఆన్‌లైన్ విధానంలో పరీక్ష (Exam)ను నిర్వహిస్తారు. ఇది గంట వ్యవధితో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
క్వాంటేటీవ్ అప్టిట్యూడ్ | 35 | 35 |
రీజనింగ్ | 35 | 35 |
ఇంగ్లీష్ | 30 | 30 |
మొత్తం | 100 | 100 |
పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 60 నిమిషాల సమయంలో 100 ప్రశ్నలు చేయాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు. పరీక్షలో నెగిటీవ్ మార్కింగ్ ఉంటుంది.
DCCB Recruitment 2021: నెల్లూరు డీసీసీబీలో ఉద్యోగాలు.. జీతం రూ. 33,000
ఎలా ప్రిపేర్ అవ్వాలి..
– అప్లికేషన్ కన్నా ముందు నుంచే పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి.
– సన్నద్ధతకు రోజు కనీసం 6 నుంచి 10 గంటల సమయం కేటాయించాలి.
– మొత్తం ఒకే సబ్జెక్టు చదవకుండా.. వాటిని విభజించుకోవాలి.
– మీకు కఠినమైన సబ్జెక్టుకు కనీసం 2 గంటల సమయం ఎక్కువగా కేటాయించాలి.
– కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించేవారు కూడా భయపడక్కర్లేదు 20 నుంచి 25 రోజుల్లో కృషి చేస్తే సబ్జెక్టుపై పట్టు సాదించవచ్చు.
– ముందు ప్రిపరేషన్‌లో కచ్చితత్వం (Accuracy) అభ్యాసం చేయాలి.
– కచ్చితత్వం అనంతరం వేగం పెంచాలి.
– సబ్జెక్టు మాత్రమే కాకుండా రోజు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి.
పరీక్షలో ఏం వస్తాయి.. ఎం చదవాలి
బ్యాంక్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముందుగా ప్రతీ విభాగంలో పాస్ అయ్యేలా ప్రిపేర్ అవ్వాలి. మూడు విభాగాల్లో కనీస మార్కులు వచ్చిన వారివి మాత్రమే మెరిట్ స్కోర్‌ను పరిగనిస్తారు.
ఇంగ్లీష్
– ఈసారి పరీక్ష తెలుగులో రాసినంత మాత్రాన ఇంగ్లీష్ ప్రాముఖ్యత మరవొద్దు.
– ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు..
– ఈ విభాగం ముఖ్య ఉద్దేశం అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills)ను పరీక్షించడం. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి.
– ఇడియమ్స్,సెంటెన్స్ కరెక్షన్, వొ కాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇం గ్లి (General English) నైపుణ్యం పెంచుకోవాలి.
– ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
– ఈ విభాగంలో ప్రధానంగా అర్థమెటిక్ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ-నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి.
– వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృక్పథంతో అడుగులు వేయాలి.
DCCB Recruitment 2021: గుంటూరు డీసీసీబీలో 67 ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు విధానం
రీజనింగ్
– ఈ విభాగంలో మంచి మార్కుల సాధనకు కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ (Practice) చేయాలి.
– లా ప్రిలిమ్స్ సమయానికి ఈ అంశాలపై పట్టు సాధిస్తే.. మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను కూడా పూర్తి చేసినట్లవుతుంది.
ఈ పరక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను పోస్టుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.