Homeబిజినెస్‌Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

Banking Rules : నూత‌న సంవ‌త్స‌రంలో ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్ లావాదేవీల ప‌రిణామాలు మారాయి.

శ‌నివారం నుంచి ఏటీఎం విత్ డ్రాయ‌ల్స్ ఫీజు భారం కావ‌డంతోపాటు.. ఖాతాదారుల సేఫ్టీ కోసం బ్యాంకు లాక‌ర్ల నిర్వ‌హ‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు మారాయి.

ఇండియ‌న్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌.. త‌న ఖాతాదారులు చేసే డిపాజిట్లు, విత్ డ్రాయ‌ల్స్ మీద‌ చార్జీలు వ‌సూలు చేస్తుంది..

Mutual Funds : యాపిల్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొంటారా

Jio Offers : రిలయన్స్ జియో న్యూ ఇయర్ ఆఫర్స్

పోస్ట్ బ్యాంకు ట్రాన్సాక్ష‌న్స్‌కూ అద‌న‌పు చార్జీలు

ఇండియ‌న్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులు ఇక నుంచి త‌మ ఖాతాల నుంచి ప‌రిమితికి మించి న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్స్ చేస్తే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ప్రారంభంలోనే నూత‌న రూల్‌ను ఐపీపీబీ నోటిఫై చేసింది.

జీఎస్టీతోపాటు సెస్ కూడా విధిస్తామ‌ని ఐపీపీబీ వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది.

ఐపీపీబీ మూడుర‌కాల సేవింగ్స్ ఖాతాల‌ను నిర్వ‌హిస్తూ ఉంటుంది.. అవి.. రెగ్యుల‌ర్ సేవింగ్స్ అకౌంట్‌, డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్‌, బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్‌.

ఇక బ్యాంకు లాక‌ర్లు సుర‌క్షితం

శ‌నివారం నుంచి బ్యాంకుల ల్యాంక‌ర్లు సుర‌క్షితం అవుతాయి..

అధికారులు, సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఖాతాదారుడి లాక‌ర్ తెరిచినా.. అందులో ఆస్తులు, ప‌త్రాలు దెబ్బ‌తిన్నా..

Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు

Indian Missile Exports : మిస్సైల్స్​ ఎగుమతి చేశే స్థాయికి భారత్​

అదృశ్య‌మైనా సంబంధిత బ్యాంకుల యాజ‌మాన్యాలు ప‌రిహారం చెల్లించాల్సిందే.

బ్యాంకుల్లోని లాక‌ర్ల‌కు సేఫ్ డిపాజిట్ వాల్ట్స్ ఉండాలి.

అగ్ని ప్ర‌మాదానికి గురైనా, దొంగ‌త‌నం, దోపిడీ, దాడుల్లో న‌ష్ట‌పోయినా, భ‌వ‌నం కూలిపోయినా, సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల బాధ్య‌త సంబంధిత బ్యాంకు అధికారుల‌దే.

క‌నుక సంబంధిత లాక‌ర్ల‌లో ఉన్న ప‌త్రాలు.. ఆస్తుల‌కు పూర్తి ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని ఆర్బీఐ తెలిపింది.

ఏటీఎం విత్‌డ్రాయ‌ల్స్ కాస్ట్‌లీ

వివిధ బ్యాంకుల ఖాతాదారులు శ‌నివారం నుంచి అద‌నంగా ఏటీఎం చార్జీలు చెల్లించాల్సిందే.

సొంత బ్యాంకు శాఖ‌తోపాటు ఇత‌ర బ్యాంకుల్లో ఏటీఎం విత్ డ్రాయ‌ల్స్ ప‌రిమితులు దాటితే అద‌న‌పు చార్జీలు చెల్లించాల్సిందేన‌ని ఆర్బీఐ ఇంత‌కుముందే జారీ చేసిన నోటిఫికేష‌న్‌లో తెలిపింది.

Movie Ticket Rates : తెలంగాణాలో సినీ ప్రేక్షకుల జేబులకు చిల్లు

Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

శుక్ర‌వారం అర్థ‌రాత్రి త‌ర్వాత ఈ చార్జీలు అమ‌లులోకి వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం ప్ర‌తి నెలా ఏటీఎం విత్‌డ్రాయ‌ల్స్ ప‌రిమితి దాటిన ప్ర‌తి లావాదేవీపై రూ.20 వ‌సూలు చేసేవారు.

తాజాగా ప్ర‌తి లావాదేవీపై రూపాయి పెంచుతూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

ఈ విష‌య‌మై బ్యాంకులు త‌మ ఖాతాదారుల‌కు ఎస్సెమ్మెస్‌ల ద్వారా స‌మాచారం ఇచ్చాయి.

Recent

- Advertisment -spot_img