HomeEnglishBanknote for vote.. Banknote for seat today నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు...

Banknote for vote.. Banknote for seat today నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు

– 10 కోట్లకు గద్వాల టికెట్​ అమ్ముకున్న రేవంత్​
– 65 సీట్లు 600 కోట్లకు విక్రయం
– టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్​
– గన్ పార్క్ వద్ద ఆందోళన

ఇదేనిజం, హైదరాబాద్​: పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి టికెట్లను అమ్ముకుంటున్నారని టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్​ ఆరోపించారు. రేవంత్​ రెడ్డి గద్వాల టికెట్​ ను రూ. 10 కోట్లు.. మూడెకరాల భూమి తీసుకొని అమ్ముకున్నారని విమర్శించారు. సోమవారం కురవ విజయ్​ కుమార్​ తన అనుచరులతో కలిసి హైదరాబాద్​ లోని గన్​ పార్క్​ వద్ద ఆందోళన చేపట్టారు. రేవంత్​ 65 టికెట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ‘రేవంత్ రెడ్డి 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. వెంటనే రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. ప్రకటించిన తొలి జాబితాను ప్రక్షాళన చేయాలి’ అంటూ విజయ్ కుమార్​ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img