Homeహైదరాబాద్latest Newsబర్రెలక్క పెళ్లి ఫిక్స్​.. అబ్బాయి ఎవరు?

బర్రెలక్క పెళ్లి ఫిక్స్​.. అబ్బాయి ఎవరు?

బర్రెలక్క అలియాస్​ శిరీష ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో.. అంతలా ఫేమస్​ అయిపోయింది బర్రెలక్క. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్​ బరిలో నిలిచి వార్తల్లోకి ఎక్కింది. ప్రధాన స్రవంతి మీడియా కూడా ఆమె న్యూస్​ కవర్​ చేసిందంటే ఆమె రేంజ్​ ఏస్థాయికి వెళ్లిందో చెప్పనవరసం లేదు. అయితే ఈ ఎన్నికల్లో బర్రెలక్క ఓడిపోయినా ఆమె క్రేజ్​ మాత్రం తగ్గలేదు. ఇక నాగర్​ కర్నూల్​ ఎంపీగా కూడా బర్రెలక్క పోటీ చేస్తుందని వార్తలు వచ్చినా ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే సడెన్​ గా బర్రెలక్క ఓ షాకింగ్​ న్యూస్​ తో వచ్చింది. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాంటూ మ్యాటర్​ రివీల్​ చేసింది. పెండ్లికి సంబంధించిన షాపింగ్​ వీడియో కూడా పోస్ట్​ చేసింది. అయితే బర్రెలక్కకు ఇప్పటికే ఓ సారి పెళ్లి అయి.. విడాకులకు దారి తీసింది. ఇదిలా ఉంటే తాజాగా బర్రెలక్క ఎవరికి పెళ్లి చేసుకోబోతుంది? వరుడు ఎవరు? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Recent

- Advertisment -spot_img