Homeఫ్లాష్ ఫ్లాష్ఓడిపోయినా.. లక్షల హృదయాల్లో నిలిచాడు

ఓడిపోయినా.. లక్షల హృదయాల్లో నిలిచాడు

బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనాలో ట్రయథ్లాన్‌లో స్పెయిన్‌కు చెందిన అథ్లెట్‌ డియాగో మెట్రిగో చూపిన క్రీడా స్ఫూర్తికి సోషల్​ మీడియాలో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పోటీలో ఓడిపోయినా అతని క్రీడాస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు.
స్పెయిన్‌కు చెందిన అథ్లెట్‌ డియాగో మెట్రిగో ముందు బ్రిటిష్‌ అథ్లెట్ జేమ్స్‌ టియాగిల్‌ పరుగెత్తుతున్నాడు. జెమ్స్ కాంస్యం సాధించడం ఇక పక్కా అని అక్కడి వారు అనుకున్నారు. అనుహ్యంగా జెమ్స్ టర్నింగ్​ చూసుకోకుండా అలాగే ముందుకు పోయి బారిగేడ్​ని చూసి ఖంగుతిని తేరుకునే లోపు మెట్రిగో ఫినిష్​ లైన్​ సమీపంలో ఉన్నాడు. ఇక్కడే సరిగ్గా మెట్రిగో నిజాయితీగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. న్యాయంగా తన కంటే ముందు పరిగెత్తిన జెమ్స్ విజయానికి అర్హుడని జెమ్స్ భావించాడు. తన వేగాన్ని తగ్గించి ఫినిష్​ లైన్​ చేరకుండానే మెట్రిగో ఫినిష్​ లైన్​ దాటేవరకు వేచి చూశాడు. దీంతో మెట్రిగో కాంస్యం సాధించడంతోపాటు జెమ్స్ క్రీడాస్ఫూర్తికి జేజేలు పలికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ట్విటర్‌లో పోస్టు చేసిన ఆ వీడియోను ఇప్పటికే 6.8 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img