తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సద్దుల బతుకమ్మ ఆఖరి రోజున మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలు బతుకమ్మ సంబురాలతో వెలిగిపోతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడుతున్నారు.కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. తొలిరోజు అంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబరాలు నేటితో ముగియనున్నాయి.