ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా విద్యార్థినులు, అధ్యాపకులు రంగు రంగుల పూలతో పేర్చి, ఆడిపాడారు. ప్రిన్సిపాల్ సుంకరి రవి మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయన్నారు. ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ అని,మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, ఆట పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.