Homeతెలంగాణభ‌‌ట్టికి షాకిచ్చిన త‌ల‌సాని

భ‌‌ట్టికి షాకిచ్చిన త‌ల‌సాని

హైద‌రాబాద్ః అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం మ‌ధ్య స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు మామూలే. కానీ బుధవారం అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌భుత్వానికి ఎన్నికల్లోనే డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు గుర్తుకువస్తాయని భట్టి విమర్శించారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. భట్టి ఇంటికి వెళ్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గురించి చెబుతానని మంత్రి తలసాని పేర్కొన్నారు. స్వ‌యంగా తానే బ‌ట్టిని తీసుకోని పోయి డ‌బుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని చూపెడ‌తానంటూ చెప్పాడు. అన్న‌ట్లుగానే మంత్రి త‌ల‌సాని ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నారు. అయితే మంత్రి బృందానికి భట్టి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్ ఇండ్లు ఎక్కడ ఎన్నిక‌డుతున్నారు, వాటి నిర్మాణం సాగుతున్న తీరును తలసాని భ‌ట్టి విక్ర‌మార్కు వివరించారు. వాటిని చూపించేందుకు భట్టిని తన కారులో మంత్రి తలసాని స్వ‌యంగా తీసుకెళ్లారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img