BC:
వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు 1లక్ష రూపాయల ప్రభుత్వ సాయం మొదలైంది .దీనికి సంబంధించిన వెబ్సైటు ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో సరళమైన విధానంలో అప్లికేషన్ ఉంటుంది. తక్షణమే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడనుంది. https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో అప్లికేషన్లు స్వీకరించబడుననని తెలిపారు.