HomeతెలంగాణBC:బీసీలు ఎటు?

BC:బీసీలు ఎటు?

బీసీలు ఎటు?

  • వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం..
  • బీసీలకు గాలం వేసేందుకు అన్ని పార్టీల యత్నం
  • లక్ష సాయం ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం
  • బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్న కాంగ్రెస్

ఇదేనిజం, స్పెషల్ బ్యూరో: రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు కీలకంగా మారింది. దీంతో అన్ని పార్టీలు వారిని మచ్చిక చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ బీసీలకు తాయిలాలు ప్రకటించింది. కులవ్రుత్తులు చేసుకొనే వారిని రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. ఇందుకోసం దరఖాస్తులు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కులాలవారీగా బీసీలకు మేలు చేసింది. మత్స్యకారులకు, గొల్లకురుమలకు పథకాలు ప్రవేశపెట్టింది.

కాంగ్రెస్ పార్టీది అదే రూటు..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ఓటు బ్యాంకు మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది. త్వరలో ఆ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఎస్సీలు, మైనార్టీలతోపాటూ బీసీలను కూడా ఆకర్షించగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గెలవొచ్చని ఆ పార్టీ భావిస్తోంది.

బీజేపీ కన్ఫ్యూజన్
మరోవైపు బీసీల విషయంలో బీజేపీ విధానం గందరగోళంగా ఉంది. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా చేసిన అనంతరం బీజేపీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆ పార్టీ ప్రచారం చేసుకున్నది. అయితే తాజాగా బండిని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. దీంతో బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి వచ్చే ఎన్నికల్లో బీసీలను తనవైపు తప్పుకొనేందుకు బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో వేచి చూడాలి.

బీసీ సంఘాల ఏమంటున్నాయి..
తెలంగాణ రాష్ట్రంలో తమకు జనాబా దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సగం సీట్లు బీసీలకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే మరి వివిధ పార్టీలు బీసీలకు సగం సీట్లు కేటాయిస్తాయా? లేదా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img