బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని హైకోర్టులో 2019లో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సీజే ధర్మాసనం విచారించింది. కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో 3 నెలల్లో బీసీ కులగణన చేయాలని ఆదేశించింది.