జాతీయ జట్టులోకి రావాలంటే.. ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ పెట్టిన షరతును పాటించేందుకు భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సిద్ధమయ్యారు. గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ.. దేశావళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టులో ఆడనున్నారు. ‘‘భారత జెర్సీని ధరించే ముందు బెంగాల్ తరఫున మైదానంలోకి దిగుతా అని షమీ తెలిపాడు. పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు కనీసం మూడు మ్యాచ్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తా’’అని షమీ పేర్కొన్నారు.