Homeహైదరాబాద్latest Newsకొత్త కోచ్ భర్తీకి కోసం బీసీసీఐ ఆహ్వానం.. హెడ్ కోచ్‌ రేసులో తెలుగు తేజం..!

కొత్త కోచ్ భర్తీకి కోసం బీసీసీఐ ఆహ్వానం.. హెడ్ కోచ్‌ రేసులో తెలుగు తేజం..!

బీసీసీఐ టీమ్ ఇండియా హెడ్ కోచ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆసక్తి ఉన్నవారు మే 27 సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని తాజా ఒక ప్రకటన బీసీసీఐ విడుదల చేసింది. బీసీసీఐ ప్రకటనలో భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌కు కావాల్సిన అర్హతలు, చేయాల్సిన పనుల గురించి ప్రస్తావించింది. కొత్తగా ఎంపికైన ప్రధాన కోచ్ పదవీకాలం మూడున్నరేళ్లు మరియు డిసెంబర్ 31, 2027 వరకు కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం రాబోయే T20 ప్రపంచ కప్ 2024తో ముగుస్తుంది. ప్రధాన కోచ్ పదవికి కొత్త దరఖాస్తుదారుల వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి మరియు అనుభవాన్ని బట్టి వేతనం ఉంటుందని బీసీసీఐ తెలిపింది.

కొత్త బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించాల్సి ఉంటుందని.. అతనికి 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారని బీసీసీఐ పేర్కొంది. ఆ జట్టు పనితీరు మరియు నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు . ప్రధాన కోచ్ సహాయక బృందానికి కూడా నాయకత్వం వహిస్తాడని అని అందులో పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం 30 టెస్టు మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. మీకు అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకుంటే, మీరు ఏదైనా ICC గుర్తింపు పొందిన దేశానికి రెండేళ్లపాటు కోచ్‌గా పనిచేసి ఉండాలని పేర్కొన్నారు. లేకుంటే ఏదైనా ఐపీఎల్ టీమ్, ఫ్రాంచైజీ లీగ్ జట్ల ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అలాగే కోచ్‌గా బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలని తెలిపారు.

అయితే టీమిండియా ప్రధాన కోచ్‌గా తెలుగు తేజం, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అతను NCA డైరెక్టర్‌గా ఉన్నాడు. అలాగే అండర్-19 మరియు ఇండియా A జట్ల ప్రధాన కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి విదేశీ కోచ్ లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, టామ్ మూడీ వంటి దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నారు. కానీ డంకన్ ఫ్లెచర్ తర్వాత బీసీసీఐ విదేశీ కోచ్‌లకు అవకాశం ఇవ్వలేదు.

Recent

- Advertisment -spot_img