టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 2024 టీ20 ప్రపంచ కప్‌లో సందడి చేసిన తర్వాత ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్ధమయ్యాడు. అయితే పాండ్యాకు బీసీసీఐ ఓ కండీషన్ పెట్టినట్లు సమాచారం. శ్రీలంక పర్యటనకు ముందు విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని హార్దిక్‌కి బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది. పాండ్యా చివరిసారిలో 2023 వన్డే ప్రపంచకప్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.