Homeహైదరాబాద్latest NewsBCCI కొత్త రూల్‌! మరింత మెరుగ్గా Cricket

BCCI కొత్త రూల్‌! మరింత మెరుగ్గా Cricket

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. భారత క్రికెట్‌ హిస్టరీలో ఈ లీగ్‌ ఎంతో ప్రత్యేకం. ఈ లీగ్‌ వచ్చాక భారత్‌లో ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. తద్వారా టీమిండియా తరపున కూడా చాన్స్‌ దక్కించుకొని ఆదరగొట్టేస్తున్నారు. జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ వీళ్లంతా ఈ కోవలోకే చెందుతారు. అయితే గతంలో భారత జట్టులో ప్లేసు దక్కించుకోవాలంటే.. సదరు ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటాల్సి ఉండేది. అక్కడ రాణించిన తర్వాతే వారు ఇండియా-ఏతో పాటు టీమిండియా తరఫున బరిలోకి దిగేవారు. కానీ ఐపీఎల్‌ రాకతో ప్రస్తుతం కొందరు ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలు ఉన్నాయనే మర్చిపోయారు. ఈ నేపథ్యంతో బీసీసీఐ ఒక కొత్త రూల్‌ తీసుకొచ్చింది. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనని క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్‌తో పాటు వేలంలో కూడా పాల్గొనకుండా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఫిట్‌గా ఉండి కూడా కొందరు ఆటగాళ్లు రంజీలకు దూరం అయిన నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు ఆలోచిస్తోంది.

Recent

- Advertisment -spot_img