ఇదేనిజం జగిత్యాల రూరల్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో రమాదేవి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో బుధవారం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. అంగన్వాడి సెంటర్లు, మధ్యాహ్న భోజనం పరిశీలించి, విద్యార్థులకు నాణ్యతమైన భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రంజిత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శేష చలపతి, శ్రీనివాస్,సూపర్వైజర్ విజయలక్ష్మి, ఏఎన్ఎం విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.