Homeహైదరాబాద్latest Newsకేకే మహేందర్ రెడ్డిపై 'అవాకులూ చెవాకులు' మాట్లాడితే జాగ్రత్త బిడ్డ.. తోట ఆగయ్య ఖబర్దార్

కేకే మహేందర్ రెడ్డిపై ‘అవాకులూ చెవాకులు’ మాట్లాడితే జాగ్రత్త బిడ్డ.. తోట ఆగయ్య ఖబర్దార్

  • కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో ఏఎన్నార్ గార్డెన్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నిన్నటి రోజున కేకే మహేందర్ రెడ్డి పై బిఆర్ఎస్ నాయకుడు తోట ఆగయ్య విమర్శలను తీవ్రంగా కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా గజ్జల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ దశలవారీగా అమలు చేస్తుంటే టిఆర్ఎస్ నాయకులు ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని అనడం సిగ్గుచేటని ఆగస్టు 15 నాడు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. తోట ఆగయ్య నీకు మతిభ్రమించింది అధికారం కోల్పోగానే కేటీఆర్ ఏం మాట్లాడిస్తున్నారు వారికి తెలియడం లేదు.

కేకే మహేందర్ రెడ్డి ని ఎస్ఎస్ మహేందర్ రెడ్డి శని ఆదివారాలు వస్తాడు అని మాట్లాడుతున్నావ్ కేటీఆర్ ఎన్నిసార్లు సిరిసిల్ల నియోజకవర్గంలోపర్యటించడుకేకే మహేందర్ రెడ్డి కి అధికారం లేకున్నా పదవి లేకున్నా మరి సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల పట్ల ప్రేమ ఉండి వాళ్లకి ఏ అవసరాలు ఉన్నా ఆయన పని చేసి పెడుతున్నారు. కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల ముందు వారానికి రెండుసార్లు సిరిసిల్లలో ఉంటానని చెప్పావు నెలకు రెండుసార్లు కూడా వస్తలేడని మండిపడ్డారు. వస్తలేవు అని ముందు తోట ఆగయ్య ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదని బిడ్డ కేకే మహేందర్ రెడ్డి పై అవాకులు చివాకులు మాట్లాడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి మిర్యాల్కర్ శ్రీనివాస్. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు. దోనుకుల కొండయ్య కేకే జిల్లా అధ్యక్షులు అరుట్ల మహేష్ .కదిరె సత్తయ్య. రామ్ రెడ్డి. సడిమెల బాలయ్య. తుపాకుల శ్రీనివాస్. రంజాన్ నరేష్. భాను. అనిల్. రమణారెడ్డి. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img