Homeహైదరాబాద్latest Newsవాటి పట్ల జాగ్రత్తగా ఉండండి.. ప్రజలకు హీరో విజయ్‌ దేవరకొండ మెసేజ్

వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి.. ప్రజలకు హీరో విజయ్‌ దేవరకొండ మెసేజ్

ఫేక్‌కాల్స్‌, మెసేజెస్‌ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్టార్ హీరో విజయ్ దేవరకొండ సూచించారు. ఈ క్రమంలో ఒక ప్రత్యేక వీడియోను విజయ్‌ దేవరకొండ విడుదల చేశాడు. స్నేహితులు లేదా శ్రేయోభిలాషులుగా నటిస్తూ డబ్బు అడిగే వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీరో విజయ్‌ అన్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లు సందేశాలు కూడా సృష్టిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి మెసేజ్‌లు వచ్చినట్లయితే, ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి వారు ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయాలి అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img