Homeహైదరాబాద్latest Newsచక్కగా ఉండండి..రనౌట్ కావద్దు

చక్కగా ఉండండి..రనౌట్ కావద్దు

World Health Day : కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందనేది వాస్తవం. అయినా కొత్తరకమైన వ్యాధులు, విపత్తులు, వివాదాలు, యుద్ధాల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోతున్నారు. కొందరి జీవితాలు ఛిద్రమై కోలుకోలేని పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఆధునికీకరణలో భాగంగా శిలాజ ఇంధనాలను మండిస్తూ సరిగ్గా గాలి కూడా పీల్చలేని దుస్థితి కొనితెచ్చుకున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏటా ఒక ఆరోగ్య సమస్యను హైలైట్ చేస్తూ World Health Organisation (WHO) ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న సెలబ్రేట్ చేస్తుంటుంది. ప్రజల్లో ఆరోగ్య హక్కుపై Awareness క్రియేట్ చేస్తోంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు మెరుగైన వైద్య సేవలు, విద్య, సమాచారం, రక్షిత మంచినీరు, స్వచ్ఛమైన గాలి, పౌష్టికాహారం, సొంతిళ్లు, పని ప్రదేశాల్లో సౌకర్యాలు, స్వచ్ఛమైన వాతావరణం, స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండేలా “My health, My Right” థీమ్‌ను ఎంచుకుంది. WHO ఆవిర్భావ దినోత్సవమైన 1948 ఏప్రిల్ 7 ను ప్రతి సంవత్సరం World Health Day గా జరుపుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img