సీతారామం సినిమాతో యువతకు డ్రీం గర్ల్ లా మారిపోయింది మృణాల్ ఠాకూర్. ఆకట్టుకునే అందం, కితకితలుపెట్టే చూపులతో ఒక్క సినిమాతో తన టాలెంట్ ఏంటో సినీ ఆడియన్స్ చవిచూశారు. ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో కూడా, ప్రేక్షకుల గుండెల్ని మెలిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో మనముందుకు రానున్న మృణాల్ ఠాకూర్, ఫోటో షూట్స్ తో అభిమానులమతి పోగొడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. సీతా రామం- హాయ్ నాన్నా సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లలో నటించిన మృణాల్ విజయ్ దేవరకొండ సరసన అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. తన కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ పాత్ర దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఫ్యామిలీ స్టార్ అనేది ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ ఉల్లాసమైన కామెడీతో నిండి ఉందని మృణాల్ వెల్లడించింది. కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని మృణాల్ చెప్పారు. ఇక పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ 5 ఏప్రిల్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ జరిపిన ఒక ఫోటో షాట్ నెట్టింట్లో క్రేజీ కామెంట్స్ ని సొంతం చేసుకుంటుంది. తెలుగు సినిమాలతో పాటు, బాలీవుడ్ లో కూడా ఒక్కొక్కటిగా అవకాశాలు సొంతం చేసుకుంటున్న మృణాల్, ఈ జెనరేషన్ హీరోయిన్లలా ఏది పడితే అది చేయకుండా, చాల సెలెక్టివ్ గా పాత్రలను చూస్ చేసుకుంటుంది.