పారిస్ ఒలింపిక్స్‌లో పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోకు చేదు అనుభవం ఎదురైంది. అందంగా ఉండి తోటి క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేసిందంటూ ఆమెను పరాగ్వే బృందం స్వదేశం పంపింది. స్విమ్ సూట్‌లతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ తన సొంత టీమ్‌కు చిరాకు తెప్పిస్తోందని, తమ క్రీడాకారుల ఏకాగ్రతను దెబ్బ తీస్తోందని భావించి ఈ చర్యలు తీసుకుంది. కాగా ఇంటికెళ్లిన మరుసటి రోజే ఆమె స్విమ్మింగ్‌కు గుడ్ బై చెప్పారు.