Homeహైదరాబాద్latest Newsప్రాపర్టీ కొనేముందు..జాగ్రత్తలు

ప్రాపర్టీ కొనేముందు..జాగ్రత్తలు

హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం గత కొన్నేళ్లుగా ఊపందుకుంటోంది. చాలామంది ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీల మాయలో పడుతూ కొంతమంది మోసపోతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్లు, తక్కువ ధర అంటూ కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ విషయాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు కచ్చితంగా తెలుసుకొని ప్రాపర్టీ విషయంలో క్రయవిక్రయాలు జరపాలి. అదేవిధంగా చాలావరకు లావాదేవీలన్నీ మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయి. వీరి పట్ల కూడా జాగ్రత్త వహించాలి.

రెరా నిబంధనలు

రెరా (RERA) గుర్తింపు లేకుండా 8 ప్లాట్లు/ 500 చ.మీ. దాటిన స్థలంలో నిర్మాణాలను ప్రారంభించరాదు.
రెరా నుంచి నమోదు పత్రం లేకుండా నిర్మాణానికి సంబంధించి ప్రకటనలు, కరపత్రాలు, గోడ పత్రికలను వేయరాదు. ప్రీలాంచ్‌ విక్రయాలు చేపట్టరాదు.
కొనుగోలుదారుల నుంచి ఆస్తి విలువలో 10 శాతం కంటే ఎక్కువగా బయానాగా తీసుకోవాలంటే ఇరువురి మధ్య సిఫార్సు చేసిన నమూనా ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. బయానా తీసుకున్న రోజే ఇంటిని స్వాధీన పర్చే తేదీని లిఖితపూర్వకంగా వెల్లడించాలి.

Recent

- Advertisment -spot_img