HomeతెలంగాణCM Revanth Reddy : ‘ప్రజా దర్బార్’ షురూ

CM Revanth Reddy : ‘ప్రజా దర్బార్’ షురూ

– ప్రజాభవన్​ వద్ద క్యూ కట్టిన జనం
– అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
– సమస్యలను పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలు

ఇదే నిజం, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను రేవంత్‌ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్‌ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్‌ ప్రకటించారు. దీంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సెక్రటేరియట్​కు చేరుకున్నారు. విద్యుత్‌శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.


కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి


బీఆర్ఎస్ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్‌కు గాయమైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై సమాచారాన్ని తనకు తెలియజేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి రిజ్వీ వెళ్లారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఆయన మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌ వద్దకు రిజ్వీ వెళ్లి పరిస్థితిని వివరించారు.

Recent

- Advertisment -spot_img