Homeహైదరాబాద్latest Newsసీఎం పదవిలో ఉండి.. ఇదేం వాగుడు.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

సీఎం పదవిలో ఉండి.. ఇదేం వాగుడు.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయాల్లోకి లాగడం ఏమిటని ఫైర్ అయ్యింది. ఇటీవల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా రేవంత్ చేసిన కామెంట్లను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డం వ‌ల్లే, క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌ని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లపై కోర్టు ఫైర్ అయ్యింది. వ్యవస్థల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం ఉండాల్సిన అవసరం లేదా? అంటూ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదని సూచించింది.

spot_img

Recent

- Advertisment -spot_img