Homeఆంధ్రప్రదేశ్బెజ‌‌వాడ దుర్గ‌మ్మ వెండి సింహాల మాయంపై ఫిర్యాదు

బెజ‌‌వాడ దుర్గ‌మ్మ వెండి సింహాల మాయంపై ఫిర్యాదు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి రథం వెండి సింహాలు మాయం ఘటనపై ఆలయ అధికారులు ఎట్ట‌కేల‌కు స్పందించారు. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఈవో సురేశ్‌బాబు ఫిర్యాదు అందజేశారు. గతేడాది ఉగాది తర్వాత రథం ఉప‌యోగించ‌లేద‌ని, 17 నెలల తర్వాత ఇంజినీరింగ్‌ పనుల కోసం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు గుర్తించామని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన నేపథ్యంలో విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. వెండి సింహాల మాయంపై ఈవో ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేస్తున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
రూ.20 ల‌క్ష‌ల విలువ‌
దుర్గామల్లేశ్వర స్వామి రథంపై ఉండే సింహాం విగ్ర‌హాల‌కు వెండి తాపడం చేసిన నాలుగు సింహాల విగ్రహాలలో మూడు మాయమైన విషయం గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం కూడా అధికారుల‌తో కూడిన క‌మిటీటి ప్ర‌త్యేకంగా నియ‌మించింది. ఈ వెండి రథాన్ని 2002లో త‌యారు చేశారు. ఒక్కో విగ్రహానికి 10 కిలోల వెండి తాపడం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం చోరీకి గురైన వాటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రతి సంవత్సరం ఉగాది రోజు గంగాపార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. అనంతరం మల్లికార్జున మహామండపంలో నిలుపుతారు. ఈ ఏడాది(2020) ఉగాది ఉత్సవాలు నిర్వహించని విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img