ఇదే నిజం, బెల్లంపల్లి : ప్రజా నాయకుడు ప్రజల మనిషి నిరంతరం నియోజకవర్గ అభివృద్ది సాధకుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యవసాయ సహకార & చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రాజెక్టులకు కావలసిన నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. మంత్రులు సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధి కొరకు కావలసిన ప్రాజెక్టులకు నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ శ్రీ బండి ప్రభాకర్ యాదవ్ , ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జమ్మికుంట విజయ్, తదితరులు పాల్గొన్నారు.