Homeహైదరాబాద్latest NewsBenefit Shows : తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు

Benefit Shows : తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు

Benefit Shows : తెలంగాణలో బెనిఫిట్ షోలు (Benefit Shows) రద్దు అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి లేదు అని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల 21వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img