- బెంగళూరు ఎయిర్ పోర్టులో ఘటన
- తప్పిన పెను ప్రమాదం
Bengaluru Air Crash: ఇదేనిజం, బెంగళూరు: సాంకేతిక లోపంతో ఓ విమానం రన్ వేపై (Air Crash) ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాజధాని బెంగళూరు(BENGALURU)లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన విమానం సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లింది.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పింది. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత ముందు వైపునున్న నోస్ ల్యాండింగ్ గేర్ రీట్రాక్ట్ అవలేదు. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. హాల్ ఎయిర్‌పోర్టులో విమానం దిగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియా (SOCIAL MEDIA)లో వైరల్ అయ్యాయి.