Homeజిల్లా వార్తలుమహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో అనే కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చందోలి జడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు పిల్లలకు మానసిక ఆరోగ్యము మరియు ప్రేరణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి జగిత్యాల మల్యాల సిడిపిఓ వీరలక్మి మాట్లాడుతూ.. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందు ఉంటూ భారతదేశ ప్రగతికి రథచక్రాలుగా మారాలని వారి అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.
అదేవిధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కో ఆర్డినేటర్ శ్రావణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో పిల్లలు అనేక రకాల ఆకర్షణలకి ముఖ్యంగా మొబైల్, ఫోన్, డ్రగ్స్, మరియు ప్రేమ అనే అంశాలకు ఆకర్షితులు కావద్దని, అదే వారి బంగారు భవిష్యత్తుకు ఆటంకం కలిగించుకుంటున్నారని వాటి నుంచి బయటపడి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఎన్ని రకాల అవంతరాలు వచ్చినా ఆకర్షణలు వచ్చినా లోను కాకుండా మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
అదేవిధంగా మహిళ సాధికారత నుండి స్వప్న మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఇప్పటికి వయసు నిండకుండా వివాహాలు చేస్తున్నారని బాల్య వివాహాల రూపంలో బాలికల యొక్క హక్కులకు భంగం కలుగుతుందని వారు 21 సంవత్సరాల వచ్చేంత వరకి లేదా ఒక వృత్తిలో పడేంత వరకి వివాహం చేసుకోరాదని సూచించారు.
అలాగే తేజస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖి కేంద్రం కేసు వర్కర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. పిల్లలు ఒక లక్ష ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా వారు ముందుకు వెళ్లాలని అలాగే సఖి అందించే సేవలు కూడా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img