Homeహైదరాబాద్latest Newsప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా సందీప్ కుమార్ ఝా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రక్త పరీక్షలు చేసే ల్యాబ్, ఫార్మసీ, వాక్సినేషన్ రూం, ఓపీ చెక్ చేసే గదిని, ఓపీ రిజిస్టర్ ను పరిశీలించి, రోజు ఎంత మంది రోగులు హాస్పిటల్ కు వస్తున్నారో డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదము ఉందని, వైద్యులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల సీజనల్ జ్వరాలకు సంబంధించిన రక్తం పరీక్షలు ఇక్కడే చేయాలని, కావాల్సిన కిట్లు, పరికరాలు అందజేస్తామని తెలిపారు.

కుక్క, కోతి దాడులతో వచ్చే వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గూడెంలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి, రోజు ఎందరు రోగులు వస్తున్నారని? సీజనల్ వ్యాధుల వ్యాప్తి పై అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని, పిల్లల హాజరు రిజిస్టర్ ను, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి బత్తుల గీతాంజలి, మెడికల్ హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img