Betting apps : డబ్బు ఇస్తున్నారు కదా అని ముందూ వెనుకా చూడకుండా బెట్టింగ్ యాప్‌లను (Betting apps) సెలబ్రిటీలు ప్రమోట్ చేసారు. ఈ బెట్టింగ్ వలలో యువత చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోవడంతో దీనిపై పోలీసులు దృష్టి సారించారు. తాజాగా 11 మంది యూట్యూబర్లు బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై హైదరాబాద్ సిటీ పోలీసుల కేసు నమోదు చేసారు. వీరిలో ప్రముఖ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఆయనా విష్ణుప్రియ, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల ఉన్నారు. అలాగే యూట్యూబర్లు సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, సన్నీయాదవ్‌పై కేసులు నమోదు చేసారు.