– వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఆన్‌లైన్ గేమ్స్‌లో బెట్టింగ్‌కు బానిసైన ఇంటర్ స్టూడెంట్.. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేటలోని మాదన్నపేట రోడ్ ఏరియాలో ఉండే చెందిన ప్రశాంత్.. ఇంటర్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై బెట్టింగ్‌ల కోసం అప్పులు చేశాడు. అయితే, అప్పు తీర్చే మార్గం లేక ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.