Betting Scam : ప్రస్తుతం ఉన్న యువత అతి తక్కువ సమయంలోడబ్బులు సంపాదించాలి అని చుస్తునారు. ఈ క్రమంలోనే అడ్డా దారులు తొక్కుతూ బెట్టింగ్ యాప్ స్కాం (Betting Scam) వలలో పడుతున్నారు. అయితే ఈ బెట్టింగ్ వలలో చిక్కుకుని చాలా మంది చనిపోతున్నారు. అలాగే తీవ్రంగా నష్టపోతున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోవడంతో దీనిపై పోలీసులు దృష్టి సారించారు. డబ్బు ఇస్తున్నారు కదా అని ముందూ వెనుకా చూడకుండా బెట్టింగ్ యాప్‌లను సెలబ్రిటీలు ప్రమోట్ చేసారు. ఇటీవలే 11 మంది యూట్యూబర్లు బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై హైదరాబాద్ సిటీ పోలీసుల కేసు నమోదు చేసారు. తాజాగా ప్రముఖ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మంచు లక్ష్మి కూడా ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రమోట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా అని తెలియాల్సి ఉంది.