చెడ్డీ గ్యాంగ్.. ఇదొక దొంగల ముఠా. చెడ్డీ గ్యాంగ్ మాదిరే ఇప్పుడు థార్ గ్యాంగ్ హల్‌చల్ సృష్టిస్తోంది. హైదరాబాద్ శివార్లలో ధార్ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ ధార్ గ్యాంగ్ దోపిడీలకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.